Tuesday, September 27, 2011

chikkumudi - Telangaana riddle

ఆంధ్ర రాష్ట్ర సాధనకి దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు మాహానుభావుడు.
దీక్షలు చేసినంత మాత్రాన తెలంగాణా ఇవ్వాలా?

తెలంగాణాకు  మేము వ్యతిరేకము కాదు.  మీరు బిల్లు పెట్టండి.
తెలంగాణా, సీమాంధ్ర నా రెండు కళ్ళు.  సమైక్యాంధ్ర, తెలంగాణా 
ఉద్యమాలకు నేను వ్యతేరేకము కాదు.

రాష్ట్ర విభజన కేంద్ర పరిధిలో వున్నది.
రాష్ట్ర విభజన ఢిల్లీలో కూర్చొని హోమ మినిస్టర్ (చిదంబరం)
న్యాయ శాఖా మినిస్టర్ (వీరప్ప మొయిలి) ఎలా నిర్ణయిస్తారు?

ప్రణబ్ ముఖర్జీ కమిటికి లేఖ ఇచ్చాము. తెలంగాణా ఫై నిర్ణయము కేంద్రానిదే.
కేంద్రము తీసుకునే నిర్ణయాన్ని మేము ఒప్పుకోవాల?

తెలంగాణా ఇస్తానంటే రాజీనామాలు చేసి కేంద్రమును 
బెదిరించి నిర్ణయం మార్చ్లుకునేటట్లు చేస్తం
.మీరు రాజీనామాలు చేస్తే తెలంగాణా ఇవ్వాలా?.

తెలంగాణా ఇస్తే దేశాన్నే ముక్కలు చేస్తం.
కేంద్రం ఆస్తులు తగలబెడుతం.
రాస్తా రోకోలు ధర్నాలతో ప్రజలకు ఇబ్బంది.
సమ్మె చేస్తే దేశాన్ని పంచాలా? తెలంగాణా ఇవ్వాలా?

తెలంగాణా ఇస్తే సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతం చేస్తం.
ఉద్యమాలతో తెలంగాణా రాదు.
  
తెలంగాణా సెంటిమెంట్ బలంగా వుంది.
సెంటిమెంటును గౌరవిస్తాము.
మా ప్రాంతవాసుల మనోభావాలకు అనుకూలంగా 
తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తము.

అధిష్టానము నిర్ణయానికి కట్టుబడి వుంటాము. 
ప్రజలే మా అధిష్టానము.
రాజకీయ లబ్దికై ఉద్యమము పేరుతొ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

సమ్మె వల్ల పాలనకు ఎలాంటి ఇబ్బంది లేదు.
సమ్మె పేరుతొ రాష్ట్రము వెనక బడుతుంది.

కేంద్ర వైఖరి, కాంగ్రెస్ వైఖరి ఒక్కటి కాదు.  
కాంగ్రెస్ వైఖరి UPA వైఖరి వేరు.  
అన్ని పార్టీల మద్దతు ఉంటేనే తెలంగాణా సాధ్యం. 
ప్రతిపక్షాల, ముఖ్యంగా BJP మద్దతు మాత్రము లెక్క కాదు.


మరి తెలంగాణా ఎలా సాధ్యం?
కాళోజి అన్నట్టు
 'ఊరి వాడిని పాతరవేసి, బైటి వాడిని తరిమికోడితే'
సాధ్యమనుకుంట.


జై తెలంగాణా!  జయహో తెలంగాణా 

Monday, September 26, 2011

Scared

 సామాన్యంగా ప్రఖ్యాత గుడులన్ని కొండల పైన వుంటాయి.  అక్కడ కోతులు కూడా ఉంటూనే వుంటాయి.  నేను ఈ మధ్య దర్శించిన ఒక ఆలయములో ఓ కోతిని అక్కడే వున్నా ఇంటిలో ఏదో సర్దుతుంటే చూసి ఫోటో తీధమని నిలబడితే అది నా అలికిడి బైటకు వచ్చింది.  నీను భయపడి వెనిక్కి తగ్గాను.  అది గుర్రుగా నన్ను చూసి వెళ్ళిపోయింది.  అది కూడా నన్ను చూసి భయపడ్డదనుకుంట.  

Sunday, September 18, 2011