Showing posts with label ఆంధ్ర బానిసలు. Show all posts
Showing posts with label ఆంధ్ర బానిసలు. Show all posts

Sunday, May 23, 2010

తెలంగాన ద్రోహులు


ఈ మాటలెందిరో
దీని మతల్బెందిరో (ఈ మాట )
తెలంగాన అంటే
సానుకూలమంట
బిల్లు పెట్టమంటే
సాధ్య పడదంట (ఈ మాట)

తెలంగాన అంటే
సెంటిమెంటు గౌరవమేనంట
తెలంగాన అడిగితే
సావ గొడతరంట (ఈ మాట)

ఓట్ల కోసమొచ్చి
కాళ్ళ మీద పడుతరు
గద్దె నెక్కినంక
ఖాకీ లతో తన్నిస్తరు(ఈ మాట)

ఈడ పుట్టి నోళ్ళు
ఈడ మెట్టి నోళ్ళు
ప్రజల మనుషులంటరు
ఓట్లు దండుకుంటరు
అసెంబ్లీ కెళ్ళి
ఆంధ్రోనికి బాన్చేలంటరు
తెలంగాన అంటే
అదేందని అంటరు(ఈ మాట)