
అమ్మ
జన్మ నిచ్చిన అమ్మ
జీవితం ఇచ్చిన అమ్మ
అవనిలో అందరకి
తోలి దైవం అమ్మ.
అమ్మ
తోలి పలుకులు
నేర్పిన అమ్మ
తప్పడుగుల వేళ
తోడుగా అమ్మ
అవనిలో అందరికి
తోలి గురువు అమ్మ.
************
కడుపునా
మోసి కన్ననాడు
బ్రహ్మనే నీవు
స్తన్యమిచ్చి బ్రతుకు నేర్పి
విష్ణుమూర్తివి అమ్మ
నా తప్పుల గరళం దాచి
ప్రేమను పంచిన
శివునివి అమ్మ.
No comments:
Post a Comment