Sunday, May 23, 2010

తెలంగాన గోస


నా చేర విడిపించ
కొడుకా! నా కొడుకా !
నువ్వు చావుకురా
నా కొడుకా! నా కొడుకా!

తెలుగోడని తెలివైనోడని
ఆంధ్రోని కప్పు గిన్చిండ్రు రా
నా బతుకే చిధ్రం
చేశిండ్రు రా

పెద్ద మనుషులున్నారు
మధ్య వర్తులున్నారు
ఒప్పందాలే చేశారు
నా బతుకు కాలరాశారు

పెద్దమనుషులు పలుకరాయే
మధ్యవర్తులు మరి లేకపోయే
న్యాయం అడిగిన నా అయ్య నోరు
జీ వోలు, ఫార్ములా లంటూ మూశారు

బండలైన నా బతుకు చూసి
నా అన్నల గుండెలే మండే
పోరుకు దిగిన వారి గుండెలను
తూటాలతో తూట్లు పొడిచిరి

తెలుగోడు తేలివిమీరినోడు
తెంపరోడు తాకట్ల ఆంధ్రోడు
నా ఆస్తులు కొల్లగొట్టి
అంత నాదే నంటాడు
నేనే నువ్వంటాడు
అంత తానే తింటాడు
నన్ను ఎండబెట్టి
వాడు బలుస్తున్నడుర

వాడి బలుపు అణచ
నన్ను రక్షించ
పోరాటం చేయరా
పోరే మన మార్గం రా
నీ వెంటే నేనుంటా
ఓ కొడుకా
పోరుబాట సాగరా
నా కొడుకా
నీ శ్వాసే నా ఆశ
నీ బతుకే నా భవిత
ప్రాణాలతో పోరు చెయ్యరా
తెలంగాణా రాష్ట్రములో
నీ నవ్వులే పసిడి పంటలురా



No comments: