life is beautiful. every breath brings new change in us. every second brings new experience. like time the energy of life is continuous and eternal.
Sunday, March 25, 2012
Friday, March 23, 2012
Ugadi Essentials
Telugu people world over are celebrating Ugadi - New year eve today. The most important recipe on this festival day is "ugadi pachidi". This is made as liquid drink in Telangana region and Andhras make it semisolid and eat. This will have six main ingredients --
new tamarind pulp
jaggery
salt
oma
unripe raw mango
neem flowers
New earthen pot is purchased.a day before or on the same day of Ugadi. The pot is washed and cleaned well. Tamarind pulp is diluted in water in the pot. Powdered jaggery is added. Neem flowers, wholly (tastes bitter) or only petals - a teaspoon added. A pinch of salt and oma are added. Raw mango is peeled and either grated or cut into very small pieces and a table spoon added to the water. All the ingredients are added so as to feel all the tastes of salt, sour, spicy, sweet, tangy and bitterness.
We face different situations and emotions in life and all these are tasted with 'ugadi pachadi'. This is the elixir of life. Ingredients added in such quantity so as to have a particular taste sweet or sour depending on one's tastes. In the early days of summer this will be really a very relishing drink.
In Warangal District in addition to these ingredients puffed bengal gram, banana pieces, grapes, grated coconut, and saunf. It will be a good nourishing fruity drink.
Labels:
Festival Recipes,
Indian festival,
ugadi pachadi
Thursday, March 8, 2012
Aakhari korika
ఆఖరి కోరిక
నేను .....
ఆడపిల్లను..
అమ్మ ఒడిలో నాడు
లోకంలో తేడాలు తెలీదు
అందుకే
అవని అమృతమయి అనుకున్న
ఆనంద డోలికలో అడమరిచా.
పసిదానిని......
తప్పటడుగులు వేశాను
అదుపులేక పడ్డాను
"చిన్ని అడుగులు వేయవే తల్లి",
అంది అమ్మ;
"జారిపడితే నిన్నెవరు చేసుకుంటారు?
అన్నాడు నాన్న.
అప్పుడే మొదలు
ముందడుగు వేయాలంటే అదురు
జీవితము నాది కాదేమోనన్న బెదురు!
పిల్లదాన్ని....
ప్రపంచములో భాగాన్ని
పాఠంలే నేర్చి ప్రతిభ చాటలనుకున్నా
"ఆడపిల్లకు అణుకువే అందం",
అన్నాడు నాన్న
"ఇది వారి ప్రపంచమే",
నిట్టూర్చింది అమ్మ.
అర్థం కాకున్నా అయ్య మాట
ఆఖరి మాట అయింది
నా జీవతాన్నినిర్దేశించేది
నేను కాదని అవగతమయింది.
వయస్సు పిల్లను........
ఊహల్లో తేలాను
నా జతగాడితో క్రాంతి పథంలోకి
అడుగు పెడతాననుకున్న
నన్నో అయ్య చేతిలో పెట్టాడు మా అయ్య
ఇక నా లోకం ఆయనే అన్నాడు
మతిలేని శ్రీమతినై నేను
ఆయన పాలనలో
పిల్లలు కనే మనిషినైన
నన్నే మరచిపోయిన.
ముసలిదాన్ని.........
బతకటం మరచినదాన్ని
అలవాటుగా బతికేస్తున్న దాన్ని
నేను కన్నయ్య
నన్ను ఇంటి దైవమంటాడు
వయ్యసులో వాళ్ళు ఊళ్లు తిరిగొస్తారు
ముసలివాళ్ళు ఇంటి ముంగిట ఉండాలంటాడు
చేతకానిదాన్ని చెప్పింది వింటాను.
కాటికి కాళ్ళు చాచుకున్న
చావని ఆశ
విశ్వ సృష్టి స్థితి లయలో
నాది కూడ సమున్నత స్థానం కావాలని
కాష్టంలో కలసిన నాడైనా
జ్వాలనై వెలుగులు జిమ్ముతూ
ఆకాశాన్ని అందుకోవాలని
బూడిదనై
పృథ్విలో పరమాణువుగ మిగలాలని .
Saturday, February 11, 2012
chinna medaram chitralu
మేడారం జాతర
అసలు సమ్మక్క జాతర మేడారంలో అయితే వరంగల్ జిల్లాల్లో
పలుచోట్ల ఈ జాతర జరుగుతుంది. అందులో ముఖ్యమైనది రాగపురం-ఆగ్రంపహాడ్
జాతర. పైకి - మేడారం పోలేని చాలామంది హన్మకొండ వరంగల్ సిటీ మరియు
చుట్టూ పక్కల ఊర్లవాళ్ళు రాగపురం వెళ్తారు.
అక్కడ తీసిన కొన్ని చిత్రాలు .....
| గద్దెల ప్రాంగణం |
| గంట కొట్టి దేవికి దండం . |
| బంగారము(బెల్లము) ఇతర అర్పనలతో నిండిన గద్దెల ప్రాంగణం . |
| ప్రయత్నించండి గద్దెలు గుర్తు పట్టగలరా? |
| ఎదురుకోల్లకు సిద్ధం |
| వదలటానికి కోడె |
.
| గద్దేలకు దగ్గరలో , ఇది ప్రమాదం కదా |
| గంపలో గాజులు అమ్మకానికే |
| పైన చూపిన పొయ్యి దగ్గరే ఈ పిల్లలు ఆడుకుంటున్నారు . |
| దారిలో ... పొలాలలో |
Wednesday, February 8, 2012
sammakka jaatara
సమ్మక్క జాతర
మేడారం జాతర
మహిమగల జాతర /జా/
ఆసియాలో అతి పెద్ద జాతర
భారతములో బహుచక్కని జాతర
ఆడవిలో జాతర
ఆదివాసుల జాతర /జా/
తల్లుల జాతర, పిల్లల జాతర
తెలంగాణా జాతర
పోరుబిడ్దల జాతర
ప్రజలందరి జాతర /జా/
పగిడిద్ద రాజు పౌరుషం గల్ల రాజు
ఆయన సతి సమ్మక్క ఆదిశక్తి రూపమే
సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు
తల్లి తండ్రులకు తగ్గ బిడ్డలే /జా/
పంటలే పండక ప్రజలే అల్లాడగా
కాకతీయ రాజుకు కప్పం కట్టననే
ప్రతాప రుద్రుడు రుద్రుడాయనే
సైన్యముతో దాడికి దిగేనే.
కోయలంత ఏకమయి
సైన్యాన్నే ఎదిరించిరి
పోరులో పగిడిద్ద రాజు
వీరమరణమే పొందేనే .
సమ్మక్క, సారలమ్మ
నాగులమ్మ, జంపన్నలు
కదనానికి కదిలిరే
సంపంగె వాగే రక్తపుటేరై సాగే.
సమ్మక్క కాళీ అయి
కాకతీయ సైన్యాన్నే కకవికలు చేసే
ఎదురొడ్డి నిలువేలని సైనికుడొకడు
వెన్ను పోటు పొడిచేనే.
వెన్నులో కత్తితో
రక్తమోడుతు తల్లి
అడవి దారిన వెళ్ళనే
.అదృశ్యమాయెనే /జా/
తల్లి పిల్లలు, పగిడిద్ద రాజు
ప్రజలకై పోరాడి ప్రాణాలే విడిచిరే
మనసున్న మనుషులు
దేవతలై వెలసిరే /జా/
అబలే సబలై
అందరికి ఆదర్శమై
స్త్రీ జాతికే స్ఫూర్తి
సమ్మక్కే ఆదిపరాశక్తి /జా/
Wednesday, January 18, 2012
Sankranthi
సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
భోగి మంటల వెచ్చదనం
భోగి పళ్ళ సంబరం
రంగవల్లుల అందం
గొబ్బి పాటల కోలాహలం
సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
పొంగలి తీయదనం
సకినాల కమ్మదనం
పతుంగుల పయనం
బసవన్నల విన్యాసం
సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
మూడురోజుల పండుగ
ముచ్చటైన పండుగ
ఇల్లంతా సందడిగా
మురిపాల పండుగ
సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
Monday, November 28, 2011
Subscribe to:
Posts (Atom)


