Friday, October 29, 2010

భద్రకాళి దేవి


ఓరుగల్లు పట్టణాన
విలసిల్లు మా తల్లి
బడగు మానవులకు
భద్రం కూర్చుభద్రకాళి.


చెరువుగట్టున ఆలయములో
చక్కంగా వెలసిన తల్లి
మ్రొక్కి పోవు వారికి
ముదము నొసగు భద్రకాళి.


కొండ కోనల నడుమ
కొలువైన తల్లి
కష్టాలనే గట్టెక్కించి
భాగ్యన్నోసగు భద్రకాళి.


*****************


వరంగల్లు వరదాయిని
భద్రకాళి శుభప్రదాయిని
కారుణ్యము కనుల జాలువారగా
మాతృ మమతలే మోమున వెల్లివిరియగా
శరణు వేడిన వారికి
అష్టైశ్వర్యాలు ప్రసాదించగా
కొలువైన మా తల్లి
భద్రకాళి మానవాళి భాగ్యప్రదాయిని

Saturday, October 9, 2010

తెలంగాణా పాట


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలుగు పాటమ్మ ఉయ్యాలో
తెలంగాణా పాటమ్మ ఉయ్యాలో -బతుకమ్మ -
ఏమని చెప్పను -ఉ-
ఏండ్ల కొద్ది గోస -ఉ-
రజాకర్లతోటి -ఉ-
రణమే చేసిరి -ఉ-
రాజరికాలు వద్దని -ఉ-
భారతంలో కల్సిరి -ఉ-
బతుకు బాగుపడుతుందని -ఉ-
ఆశలే పడినారు -ఉ-
బతుకమ్మ బతుకమ్మ -ఉ -
బతుకుపాటమ్మ -ఉ-
తెలుగు పాటమ్మ -ఉ-
తెలంగాణా పాటమ్మ -ఉ-
తెలుగోడినంటు -ఉ-
ఆంధ్రోడు జొరబడే -ఉ-
భాష నేర్పుతానంటు -ఉ-
యాసనే ఎక్కిరించే -ఉ-
అండి అండి అంటూనే -ఉ-
తొండి చేయబట్టే -ఉ-
తెలివిగా వాడు -ఉ-
తెలంగాణా తొక్కబట్టే-ఉ-
మంది బలంతో -ఉ-
మాయమాటలతో -ఉ-
తెలంగాణా బతుకులనె -ఉ-
తెర్లు చేయబట్టే -ఉ-
-బతుకమ్మ -
ఉద్యోగాల్లో జొరబడి -ఉ-
ఊళ్లేలబట్టే -ఉ-
నిధులు కొల్లగొట్టే -ఉ-
నీళ్ళు మల్లగోట్టుకునే -ఉ-
తెలంగాణా బతుకులనే -ఉ-
ఎడారి చేసెనే -ఉ-
-బతుకమ్మ -
అన్న్యామెందంటే - ఉ-
అన్నలంటూ కాల్చిరి -ఉ-
పల్లె బతుకులనే -ఉ-
వల్లకాడు చేసిరి -ఉ-
తెలంగాణా బతుకులు -ఉ-
తెర్లు తెర్లు చేసిరి -ఉ-
-బతుకమ్మ-
మండిన గుండెలు -ఉ-
కాలిన కడుపులు -ఉ-
ఉద్యమ జ్వాలై -ఉ-
ఎగిసిపడేనే -ఉ-
ఊరు వాడలు -ఉ-
ఒక్కటై నేలిచేనే -ఉ-
కులాలు మతాలూ -ఉ-
కలసి పోయేనె -ఉ-
జై తెలంగాణా అంటూ -ఉ-
కదం తోక్కిరి -ఉ-
తెలంగాణా కావాలంటూ -ఉ-
తెగించి పోరాడబట్టిరి -ఉ
-బతుకమ్మ-
నాడు కృష్ణ రాయబారం- ఉ-
కురుక్శేత్రము తెచ్చే -ఉ-
నేటి కృష్ణ కమిటి -ఉ-
ప్రజక్షేత్రమే తెచ్చు -ఉ-
పోరాడి ప్రజలే -ఉ-
తెలంగాణా తెచ్చేరు -ఉ-
జై తెలంగాణా అంటూ -ఉ
ఆడి పాడేరు -ఉ-
బతుకమ్మ బతుకమ్మ -ఉ-
బంగారు బతుకమ్మ -ఉ-
బతుకు పాట ఇది -ఉ
తెలంగాణా పోరు పాట -ఉ-

Saturday, September 11, 2010

వినాయక చవితి


వర్షా కాలం వచ్చింది
వినాయక చవితిని తెచ్చింది
పత్రీ పుష్పం తేరండి
విఘ్నదిపతినే కొలవండి
విద్య బుద్ధులిమ్మని
బొజ్జ గణపయ్యనే వేడండి.

Wednesday, August 4, 2010

తల్లి పాలు


శిశువునకు

అమృతము కన్న
అమ్మ పాలే మిన్న
ఆరునెల్ల వరకు
ఆహారం అదేనన్న.

ముర్రిపాలు మురిపాల పాలు
మళ్ళి వచ్చే పాలు
మహాభాగ్యాన్ని (ఆరోగ్యాన్ని) ఇచ్చే పాలు
మమతానురాగాలు పెంచే పాలు.

ఆకలైనా దూపైన
అమ్మకు ఎలావున్నా
అమ్మ పాలే ఆరోగ్యమన్న
రోగాలనన్నితరిమికోట్టునన్న.

Saturday, July 31, 2010

పోరాడి సాధిద్దాం

తెలంగాణా రావాలంటే
ఉద్యమించరా,
తెలంగాణా కావాలంటే
కదం తొక్కరా.

అడుగు వెనక పడవద్దు
ఆత్మహత్యలు, బలిదానాలు వద్దే వద్దు
జనమంతా నీ వెంటే
ఆగక ముందుకు సాగరా.

ప్రాణముంటే పోరున్నది
పోరాడితే జయం మనదే
యోధుడవై ప్రభవించరా
భావి జీవితం నీదేరా.

తల్లి గుండెలు తల్లడిల్ల
ప్రాణ త్యాగామేలరా?
నీవు లేని తెలంగాణా
మరుభూమే కదరా.

శక్తులన్నీ కూడగట్టి
యుక్తులన్నీ ముందుబెట్టి
ఉగ్రమూర్తివై ఉద్యమించరా
విజయం తధ్యమేనురా.

జై తెలంగాణా, జై జై తెలంగాణా.

ప్రజాభీష్టం

జై తెలంగాణా, జై జై తెలంగాణా
జై తెలంగాణా, జై జై తెలంగాణా

నోట్లేన్ని ఇచ్హినా,
సారాలో ముంచెత్తినా
ప్రజలేమన్నారు?
తెలంగాణే కావాలన్నారు -జై తెలంగాణా -

బిర్యాని తినిపించినా,
బీరే తాగించిన
ప్రజలేమన్నారు?
తెలంగాణే కావాలన్నారు - జై తెలంగాణా-

బాధలెన్ని పెట్టినా,
బందూకు చూపించినా
ప్రజలేమన్నారు?
తెలంగాణే కావాలన్నారు - జై తెలంగాణా -

Monday, July 12, 2010

వాన వాన రావమ్మ


వాన వాన రావమ్మ
ఉరుకులు పరుగుల రావమ్మ
ఉరుముతు మెరుస్తూ రావమ్మ
మళ్ళి మళ్ళి రావమ్మ.

ఎండిన నోళ్లను తడపంగా
నేర్రల నేల చిత్తడికాగా
రైతన్నలే మురిసిపోగా
ముసుర్ల వానై రావమ్మ - వాన వాన -

చెట్టు చేమ విరియంగా
చెరువులు చెలమలు నిండంగ
పంట పోలలే పండంగ
చిరుజల్లై జల్లుజల్లున రావమ్మా - వాన వాన -

వాగులు వంకలు ఉరకలేయగా
నదులే పొంగి పొరలంగా
జోరు గాలులే వీయంగ
జడి వానై రావమ్మా - వాన వాన -