Saturday, July 31, 2010

పోరాడి సాధిద్దాం

తెలంగాణా రావాలంటే
ఉద్యమించరా,
తెలంగాణా కావాలంటే
కదం తొక్కరా.

అడుగు వెనక పడవద్దు
ఆత్మహత్యలు, బలిదానాలు వద్దే వద్దు
జనమంతా నీ వెంటే
ఆగక ముందుకు సాగరా.

ప్రాణముంటే పోరున్నది
పోరాడితే జయం మనదే
యోధుడవై ప్రభవించరా
భావి జీవితం నీదేరా.

తల్లి గుండెలు తల్లడిల్ల
ప్రాణ త్యాగామేలరా?
నీవు లేని తెలంగాణా
మరుభూమే కదరా.

శక్తులన్నీ కూడగట్టి
యుక్తులన్నీ ముందుబెట్టి
ఉగ్రమూర్తివై ఉద్యమించరా
విజయం తధ్యమేనురా.

జై తెలంగాణా, జై జై తెలంగాణా.

ప్రజాభీష్టం

జై తెలంగాణా, జై జై తెలంగాణా
జై తెలంగాణా, జై జై తెలంగాణా

నోట్లేన్ని ఇచ్హినా,
సారాలో ముంచెత్తినా
ప్రజలేమన్నారు?
తెలంగాణే కావాలన్నారు -జై తెలంగాణా -

బిర్యాని తినిపించినా,
బీరే తాగించిన
ప్రజలేమన్నారు?
తెలంగాణే కావాలన్నారు - జై తెలంగాణా-

బాధలెన్ని పెట్టినా,
బందూకు చూపించినా
ప్రజలేమన్నారు?
తెలంగాణే కావాలన్నారు - జై తెలంగాణా -

Monday, July 12, 2010

వాన వాన రావమ్మ


వాన వాన రావమ్మ
ఉరుకులు పరుగుల రావమ్మ
ఉరుముతు మెరుస్తూ రావమ్మ
మళ్ళి మళ్ళి రావమ్మ.

ఎండిన నోళ్లను తడపంగా
నేర్రల నేల చిత్తడికాగా
రైతన్నలే మురిసిపోగా
ముసుర్ల వానై రావమ్మ - వాన వాన -

చెట్టు చేమ విరియంగా
చెరువులు చెలమలు నిండంగ
పంట పోలలే పండంగ
చిరుజల్లై జల్లుజల్లున రావమ్మా - వాన వాన -

వాగులు వంకలు ఉరకలేయగా
నదులే పొంగి పొరలంగా
జోరు గాలులే వీయంగ
జడి వానై రావమ్మా - వాన వాన -