Showing posts with label పదవి యాత్ర. Show all posts
Showing posts with label పదవి యాత్ర. Show all posts

Thursday, May 27, 2010

ఓదార్పు యాత్ర!?

ఓదార్పు యాత్రా!?
కాదు, కాదు
ఇది రాజకీయ జాతర!
ఆధిపత్య పోరురా.

తండ్రి శవం సాక్షిగా
పదవి కాంక్షే మిన్నంటగ
సంతకాలు సేకరించే తనయులుండగా
ఎవరో చచ్చారని చని పోయేది ఎవరురా ?

తండ్రి పొయే పదవి రాకపాయే
సంవత్సరీకము దగ్గరప డెనాయె
ఓదార్పు ఎవరకిరా? ఓదార్పు ఎందుకురా ?
పదవి రానందుకా?అధికారం నిలుపుకునే టందుకా?
ఓరుగల్లు పోరు జాతర
మారాలి యుద్ధ భేరిగా
సీమనేతలనే తరిమి కొట్టరా
తెలంగాణా రాష్ట్రమే అవతరించగా.

జై తెలంగాణా, జై జై తెలంగాణా.




జై తెలంగాణా,