Showing posts with label ఆంధ్ర మోసం. Show all posts
Showing posts with label ఆంధ్ర మోసం. Show all posts

Tuesday, June 1, 2010

ఆంధ్ర ఆధిపత్యం

ఇదేమి న్యాయం? ఇదెక్కడి అన్యాయం?
ఇదేమి న్యాయం? ఇదెక్కడి అన్యాయం?
కిరాయికి వచ్చి
కబ్జా చేసుకుంటే
ఇసింత రమ్మంటే
ఇల్లంతా నాదంటే -ఇదేమి-

ప్రాంతం వాడు పర్యటిస్తా నంటే
ఆంక్షలు, అవరోధాలు, అరెస్టులు
ప్రాంతేతరుడు వస్తే
అదనపు రక్షణలు, బలగాల మొహరింపులు -ఇదేమి-

కలసి ఉంటేనే కలదు సుఖమంటు
కుత్తుక ఫై కత్తి పెడతారు
అన్నదమ్ములంటూ వనరులన్నీ దోచుకుంటు
వేరు కుంపటంటే నిప్పు పెడతామంటారు -ఇదేమి-