Showing posts with label ధూమపానం కాన్సెర్ కు సోపానం. Show all posts
Showing posts with label ధూమపానం కాన్సెర్ కు సోపానం. Show all posts

Monday, May 31, 2010

పొగాకు కాన్సెర్ కు తోడ్పాటు


సరదాల సిగరెట్టు
గుమ్మన్పించే గుట్కాలు
చేస్తాయి నిన్ను
కాన్సెర్ కు నేస్తాలు.

సిగరెట్లు, గుట్కాలు,
జర్దా పానులు
పొగాకు ప్రతి రూపాలు
అనారోగ్య కారకాలు.

డాబు కోసం, పోజు కోసం
చేస్తే పొగాకుతో నేస్తం
నూరేళ్ళ జీవితం
కావలసిందే పరిమితం.

దగ్గుతో, దమ్ముతో, కాన్సెర్ పుండ్లతో
ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరిగా
పుడక ఫై పడకకై
పరతపించాలి.

డబ్బు పెట్టి జబ్బు కొనుక్కొని
షోకు అంటూ మిడిసిపడితే
కాన్సరే నీ నేస్తం
కాటికి నీ పయనమే కష్టాలమయం.