Friday, October 29, 2010

భద్రకాళి దేవి


ఓరుగల్లు పట్టణాన
విలసిల్లు మా తల్లి
బడగు మానవులకు
భద్రం కూర్చుభద్రకాళి.


చెరువుగట్టున ఆలయములో
చక్కంగా వెలసిన తల్లి
మ్రొక్కి పోవు వారికి
ముదము నొసగు భద్రకాళి.


కొండ కోనల నడుమ
కొలువైన తల్లి
కష్టాలనే గట్టెక్కించి
భాగ్యన్నోసగు భద్రకాళి.


*****************


వరంగల్లు వరదాయిని
భద్రకాళి శుభప్రదాయిని
కారుణ్యము కనుల జాలువారగా
మాతృ మమతలే మోమున వెల్లివిరియగా
శరణు వేడిన వారికి
అష్టైశ్వర్యాలు ప్రసాదించగా
కొలువైన మా తల్లి
భద్రకాళి మానవాళి భాగ్యప్రదాయిని

Saturday, October 9, 2010

తెలంగాణా పాట


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలుగు పాటమ్మ ఉయ్యాలో
తెలంగాణా పాటమ్మ ఉయ్యాలో -బతుకమ్మ -
ఏమని చెప్పను -ఉ-
ఏండ్ల కొద్ది గోస -ఉ-
రజాకర్లతోటి -ఉ-
రణమే చేసిరి -ఉ-
రాజరికాలు వద్దని -ఉ-
భారతంలో కల్సిరి -ఉ-
బతుకు బాగుపడుతుందని -ఉ-
ఆశలే పడినారు -ఉ-
బతుకమ్మ బతుకమ్మ -ఉ -
బతుకుపాటమ్మ -ఉ-
తెలుగు పాటమ్మ -ఉ-
తెలంగాణా పాటమ్మ -ఉ-
తెలుగోడినంటు -ఉ-
ఆంధ్రోడు జొరబడే -ఉ-
భాష నేర్పుతానంటు -ఉ-
యాసనే ఎక్కిరించే -ఉ-
అండి అండి అంటూనే -ఉ-
తొండి చేయబట్టే -ఉ-
తెలివిగా వాడు -ఉ-
తెలంగాణా తొక్కబట్టే-ఉ-
మంది బలంతో -ఉ-
మాయమాటలతో -ఉ-
తెలంగాణా బతుకులనె -ఉ-
తెర్లు చేయబట్టే -ఉ-
-బతుకమ్మ -
ఉద్యోగాల్లో జొరబడి -ఉ-
ఊళ్లేలబట్టే -ఉ-
నిధులు కొల్లగొట్టే -ఉ-
నీళ్ళు మల్లగోట్టుకునే -ఉ-
తెలంగాణా బతుకులనే -ఉ-
ఎడారి చేసెనే -ఉ-
-బతుకమ్మ -
అన్న్యామెందంటే - ఉ-
అన్నలంటూ కాల్చిరి -ఉ-
పల్లె బతుకులనే -ఉ-
వల్లకాడు చేసిరి -ఉ-
తెలంగాణా బతుకులు -ఉ-
తెర్లు తెర్లు చేసిరి -ఉ-
-బతుకమ్మ-
మండిన గుండెలు -ఉ-
కాలిన కడుపులు -ఉ-
ఉద్యమ జ్వాలై -ఉ-
ఎగిసిపడేనే -ఉ-
ఊరు వాడలు -ఉ-
ఒక్కటై నేలిచేనే -ఉ-
కులాలు మతాలూ -ఉ-
కలసి పోయేనె -ఉ-
జై తెలంగాణా అంటూ -ఉ-
కదం తోక్కిరి -ఉ-
తెలంగాణా కావాలంటూ -ఉ-
తెగించి పోరాడబట్టిరి -ఉ
-బతుకమ్మ-
నాడు కృష్ణ రాయబారం- ఉ-
కురుక్శేత్రము తెచ్చే -ఉ-
నేటి కృష్ణ కమిటి -ఉ-
ప్రజక్షేత్రమే తెచ్చు -ఉ-
పోరాడి ప్రజలే -ఉ-
తెలంగాణా తెచ్చేరు -ఉ-
జై తెలంగాణా అంటూ -ఉ
ఆడి పాడేరు -ఉ-
బతుకమ్మ బతుకమ్మ -ఉ-
బంగారు బతుకమ్మ -ఉ-
బతుకు పాట ఇది -ఉ
తెలంగాణా పోరు పాట -ఉ-