Monday, February 28, 2011

తెలంగాణా పోరు


తెలంగాన పోరు సాగుతుందిరా
ప్రజా చైతన్యముతో జోరుగా సాగుతుందిరా
|తెలంగాన పోరు|
జయశంకరే సూత్రధారిగా

చంద్రశేఖరే పాత్రధారిగా

మేధావుల వ్యుహరచనలతో
విద్యార్థులు విప్లవ శక్తితో

|తెలంగాన పోరు |
కులమనక మతమనక

పిల్లలనక పెద్దలనక

స్త్రీ పురుష తేడ లేక

జనమంతా ఏకముకాగా
|తెలంగాన పోరు|
లాటిలకు అదరక

తూటాలకు బెదరక

ఐ.కా.స లన్ని కల్సి

తెలంగాన కంకణం కట్టు కోంగ

|తెలంగాన పోరు|
ప్రజా శక్తే ఆయుధంగ
సహాయ నిరాకరణె సిద్ధాంతంగా

వలస పాలన అంతముకై

జనమంతా కదం తొక్కంగ

|తెలంగాన పోరు|