Sunday, June 26, 2011

తెలంగాణా పితామహ

జయశంకరా! ఉద్యమవీరుడా!
ఆశయ సిద్ధికై
అలుపెరుగని పోరాటం చేసిన
మహా యోధుడా!

కత్తి పట్టని వీరుడవి
కలం శక్తిని చాటిన ధీరుడవి
రాష్ట్ర సాధనకై
అక్షరమై ఉద్యమించిన శూరడవి.

రాజకీయాలకు నీవు దూరం,
రాజకీయనాయకులే నీకు దాసోహం;
మృదు భాషణలతో, ముక్కుసూటి వ్యాఖ్యలతో
శత్రువునైన వినమ్రుని చేసే సహనశీలివి.

మేధా శక్తితో, వ్యూహాల యుక్తితో
భావజాల వ్యాప్తితో
జీవతాంతం ఉద్యమించిన
యుగ పురుషుడివి, తెలంగాణ పితమహుడివి!

జై తెలంగాణా! జై జై జయశంకర్!!


Friday, June 24, 2011

స్ఫూర్తి యాత్ర

శంకరా! జయశంకరా!
శంకరా! జయశంకరా
నీవు పోయవంటున్నారు,
నే వెటు పోగలవయ్య?

తల్లి తెలంగాణా ముద్దు బిడ్డవు
స్వరాష్ట్ర సాధనకు తిప్పలెన్ని పడ్డావు
ఆశయ సిద్ధికి అడుగు దూరములో
నీ వెటు పోగలవయ్య?

నింగి కెగసిన నీవు
నక్షత్రానివై కాంతులు వెదజల్లేవు
నీ అక్షర కాంతులలో
ఉద్యమాన్నే ముందుకు నడిపేవు.

గాలిలో కలసిన నీ ఊపేరే
ఉద్యమానికి ఆయువై నిలిచేను
తెలంగాణా సాధించేవరకు
అది ఆగక సాగేను.

అలసి రాలిన నీ కాయం
అగ్ని జ్వాలై ప్రజ్వరిల్లి
ఉద్యమ దిశనే నిర్దేశించగా
తెలంగాణా సాధనే తధ్యం కదా!

నేలలో కలసిన నీవు
తెలంగాణా అంతర్భాగమై
నవ తెలంగాణా నిర్మాణములో
మమ్ము ముందుకు నడిపించేవుగా.

జాలమై నీవు జయశంకరా
నీ పిల్లల కన్నీళ్ళే తుడువగా
స్వరాష్ట్రములో జీవధారవై
తెలంగాణనే సస్యశ్యామలం చేసేవుగా.

శంకరా, జయశంకరా!
నీ వెటు పోలేవయ్య,
మా ప్రాణమై, ప్రగతిశీల శక్తివై
మా జీవితములో జీవంగా నిలిచేవయ్యా.

జై తెలంగాణా! జై జై జయశంకర్!