జయశంకరా! ఉద్యమవీరుడా!
ఆశయ సిద్ధికై
అలుపెరుగని పోరాటం చేసిన
మహా యోధుడా!
కత్తి పట్టని వీరుడవి
కలం శక్తిని చాటిన ధీరుడవి
రాష్ట్ర సాధనకై
అక్షరమై ఉద్యమించిన శూరడవి.
రాజకీయాలకు నీవు దూరం,
రాజకీయనాయకులే నీకు దాసోహం;
మృదు భాషణలతో, ముక్కుసూటి వ్యాఖ్యలతో
శత్రువునైన వినమ్రుని చేసే సహనశీలివి.
మేధా శక్తితో, వ్యూహాల యుక్తితో
భావజాల వ్యాప్తితో
జీవతాంతం ఉద్యమించిన
యుగ పురుషుడివి, తెలంగాణ పితమహుడివి!
జై తెలంగాణా! జై జై జయశంకర్!!
No comments:
Post a Comment