సాధించాలి, సాధించాలి
తెలంగాణా సాధించాలి
పోరాటమే చేయాలి
తెలంగాణా సాధించాలి.
ఆవేదనే ఆవేశము రగిలించగా
అణచివేతే ఆలోచనల కాంతులు జిమ్మగ
ఆఖరి ఊపిరి వరకు సమరము చేయాలి
శత్రువునే తరిమి తరిమి కొట్టాలి.
ఆత్మహత్యలు ప్రాణత్యాగాలు
నిరాశ నిస్పృహకు నిదర్శనాలు
సమరయోధులకవి హృదయభారాలు
శత్రువులకేమో విజయ గీతికలు.
ధనమదాంధులను,ఆధికార దురహంకారులను
ప్రాంతంలోని బాన్చేగాల్లను
అత్మస్తైర్యముతో ఎదుర్కోవాలి
ఆశయ సిద్ధి వరకు పోరాటమే చేయాలి.
లాటీలు విరిగిన తూటాలు పేలినా
శక్తితో, యుక్తితో, వ్యూహాల విస్తృతితో
అలుపెరుగక సాగాలి
అఖండ విజయమునే సాధించాలి.
జై తెలంగాణ జయహో జయశంకర్
No comments:
Post a Comment