Sunday, October 2, 2011

Bathukamma Pata

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో 
బంగారు బతుకమ్మ ఊయ్యాలో
బతుకు పాట ఊయ్యాలో 
బహుజనుల పాట ఊయ్యాలో 
ప్రకృతి పూజ ఊయ్యాలో
పరమేశ్వరి పండుగ ఊయ్యాలో
పల్లె పట్టణాల పండుగ ఊయ్యాలో 
పడతుల పండుగ ఊయ్యాలో
పువ్వుల పండుగ ఊయ్యాలో
తీరొక్క పూలతో ఊయ్యాలో
గునుగు పూలతో ఊయ్యాలో 
గౌరమ్మనే కొలతు ఊయ్యాలో
తంగేడు పూలతో ఊయ్యాలో
తల్లినే తలచు కొందు ఊయ్యాలో
ముత్యాల పూలతో ఊయ్యాలో
మురిపెంగా పూజింతు ఊయ్యాలో
పట్టుపూలతో ఊయ్యాలో 
పాదాభివందనాలు ఊయ్యాలో 
బంతిపూలు పేర్చితి  ఊయ్యాలో
బంగారు భవితివ్వు ఊయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో
బంగారు గౌరమ్మ ఊయ్యాలో 
బంగారు బతుకివ్వు ఊయ్యాలో
బతుకమ్మ  బతుకమ్మ ఊయ్యాలో 




No comments: