సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
భోగి మంటల వెచ్చదనం
భోగి పళ్ళ సంబరం
రంగవల్లుల అందం
గొబ్బి పాటల కోలాహలం
సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
పొంగలి తీయదనం
సకినాల కమ్మదనం
పతుంగుల పయనం
బసవన్నల విన్యాసం
సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
మూడురోజుల పండుగ
ముచ్చటైన పండుగ
ఇల్లంతా సందడిగా
మురిపాల పండుగ
సంక్రాంతి వచ్చింది
సంతోషం తెచ్చింది
No comments:
Post a Comment