Wednesday, February 8, 2012

sammakka jaatara

జాతారో, జాతర
సమ్మక్క జాతర 
మేడారం జాతర 
మహిమగల జాతర /జా/

ఆసియాలో అతి పెద్ద జాతర 
భారతములో బహుచక్కని జాతర 
ఆడవిలో జాతర 
ఆదివాసుల జాతర /జా/

తల్లుల జాతర, పిల్లల జాతర 
తెలంగాణా జాతర 
పోరుబిడ్దల జాతర 
ప్రజలందరి జాతర /జా/

పగిడిద్ద రాజు పౌరుషం  గల్ల రాజు 
ఆయన సతి సమ్మక్క ఆదిశక్తి రూపమే
సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు
తల్లి తండ్రులకు తగ్గ బిడ్డలే /జా/

పంటలే పండక ప్రజలే అల్లాడగా  
కాకతీయ రాజుకు కప్పం కట్టననే 
ప్రతాప రుద్రుడు రుద్రుడాయనే
సైన్యముతో దాడికి దిగేనే. 

కోయలంత ఏకమయి
 సైన్యాన్నే ఎదిరించిరి
పోరులో పగిడిద్ద రాజు
వీరమరణమే పొందేనే .

సమ్మక్క, సారలమ్మ 
నాగులమ్మ, జంపన్నలు 
కదనానికి కదిలిరే 
సంపంగె వాగే రక్తపుటేరై సాగే.

సమ్మక్క కాళీ అయి 
కాకతీయ సైన్యాన్నే కకవికలు చేసే 
ఎదురొడ్డి నిలువేలని సైనికుడొకడు 
వెన్ను పోటు పొడిచేనే.

వెన్నులో కత్తితో 
రక్తమోడుతు తల్లి 
అడవి దారిన వెళ్ళనే 
.అదృశ్యమాయెనే /జా/

తల్లి పిల్లలు, పగిడిద్ద రాజు 
ప్రజలకై పోరాడి ప్రాణాలే విడిచిరే 
మనసున్న మనుషులు 
దేవతలై వెలసిరే /జా/

అబలే సబలై 
అందరికి ఆదర్శమై
స్త్రీ జాతికే స్ఫూర్తి 
సమ్మక్కే ఆదిపరాశక్తి /జా/






No comments: