Monday, March 26, 2012

Raajakiyam

రాకాసీయం

పార్లమెంటులో టి ఎం.పిల మాట
అధిష్టానము ఆడించే ఆట
స్కాములను మరిపించే సైయ్యాట
రాబోవు ఎన్నికల్లో గెలుపుకు బాట.

*********************************

చంద్రబాబు సంతాపం
ఒడిపోయిన పరితాపం
మసకైన రెండు కళ్ళ సిద్ధాంతం
భవిష్యత్తులో గెలుపుకే సరి కొత్త యత్నం.

*****************************

ఏండ్ల కొద్ది కొట్లాడుతున్నా
భావోద్వేగా సమస్యంటరు
వందల్లో యువకులు చస్తున్నా
సెంటిమెంటు అంటూ సాగాదీస్తున్నరు 
అలజడులు ఆపేసి, సమ్మెను సస్పెండ్ చేసి 
ఎన్నికల్లో గెలచినా 
అత్మహుతులతో నిరసన తెలిపినా
ప్రశాంత పరిస్థితి లేదనే 
కబోది కేంద్రానికి
కాసుల గల గలలు తప్ప
మరణ మృదంగం వినిపించదా?

No comments: